భారతదేశం, డిసెంబర్ 19 -- గత బీఆర్ఎస్ హయాంలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో సిట్ దర్యాప్తు పూర్తి చేసి త్వరితగతిన చార్జిషీట్ దాఖలు చేస్తామని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు.

ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరినే సిట్‌ దర్యాప్తు అధికారిగా నియమించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని గుర్తించారు. అయితే కేసు నమోదైన 21 నెలల తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటంతో ఈ కేసు విచారణ మరింత ఆసక్తికరంగా మారినట్లు అయింది.

స...