భారతదేశం, డిసెంబర్ 11 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు గట్టి షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం. ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించింది. ఈ సందర్భంగా లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

"రేపు ఉదయం 11.00 గంటలలోపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మరియు దర్యాప్తు అధికారి (సిట్) ముందు లొంగిపోవాలని పిటిషనర్ ను ఆదేశిస్తున్నాం. చట్టానికి అనుగుణంగా కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. పిటిషనర్ తన ఇంటి నుంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవచ్చ "అని ధర్మాసనం తెలిపింది.

విచారణ సందర్భంగా రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వ...