భారతదేశం, జూలై 2 -- ముంబైలోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్ తన విద్యార్థిపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిందనే ఆరోపణలపై పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని ఆ టీచర్ గత ఏడాదిగా లైంగికంగా వేధిస్తోందని పోలీసులు తెలిపారు.

పెళ్లై పిల్లలున్న 40 ఏళ్ల టీచర్ 16 ఏళ్ల 11వ తరగతి లోబర్చుకుని లైంగికంగా వాడుకున్న ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 2023 డిసెంబర్ లో హైస్కూల్ వార్షిక ఫంక్షన్ కోసం డ్యాన్స్ గ్రూపులను ఏర్పాటు చేసే సమయంలో ఆమె తన విద్యార్థి పట్ల ఆకర్షితురాలైంది. 2024 జనవరి నుంచి అతడిని లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్ ఆ విద్యార్థిని ''మనం ఒకరి కోసం మరొకరం జన్మించాం'' అని చెప్పేది. ఆ బాలుడిలో భయం పోగొట్టడం కోసం యాంటీ యాంగ్జైటీ మాత్రలు ఇవ్వడం ...