Hyderabad, జూలై 27 -- నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన సినిమా చైనా పీస్. అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూనిక్ స్పై యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందించారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.

తాజాగా శనివారం (జూలై 26) చైనా పీస్ టీజర్‌ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో సందీప్ కిషన్ హాజరై చైనా పీస్ టీజర్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన చైనా పీస్ టీజర్ లాంచ్‌లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పీపుల్ స్టార్ సందీప్ కిషన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈవెంట్‌తో మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరితో కలిసి ఈ టీజర్‌ని సెలబ్రేట...