Hyderabad, ఏప్రిల్ 25 -- యాళం నుంచి వచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్. అయితే, తన షాకింగ్ కామెంట్స్‌తో ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్‌గానే దక్షిణాది సినిమాల్లో హీరోయిన్స్ నాభిని చూపించడానికి మేకర్స్ చాలా ఇష్టపడతారని, జూమ్ చేసి మరి ఫొటోలు చూస్తారని సంచలన కామెంట్స్ చేసింది మాళవిక మోహనన్.

తాజాగా మరోసారి అలాంటి సంచలన కామెంట్స్ చేసింది ఈ మలయాళ బ్యూటి. ఈసారి ఫెమినిజంపై తన అభిప్రాయాలు చెప్పిన మాళవిక మోహనన్ చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత పాతుకుపోయిందని దుయ్యబట్టింది. ఇక ఫెమినిస్టులమని నటించే మేల్ యాక్టర్స్, హీరోలను విమర్శిస్తూ, వారు ముసుగు వేసుకుని ఎలా తిరుగుతారో తనకు తెలుసని కౌంటర్స్ వేసింది.

రీసెంట్‌గా హాటర్‌ఫ్లైకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫెమినిజంపై తన అభిప్రాయాలను పంచుకుంది మాళవిక మోహనన్. ఈ ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్ మాట్ల...