Hyderabad, జూలై 14 -- ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం అనేక మార్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫెంగ్ షుయ్ టిప్స్‌ని ఫాలో అవ్వడం కూడా మంచిది. ఈ ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండొచ్చు. మరి ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఎలాంటి టిప్స్‌ని పాటించాలి? ఏ మార్పులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.

1.ఇల్లు శుభ్రంగా ఉండాలి: ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటికి కొలువై ఉంటుంది. ఎప్పుడు క్లీన్ చేసి ఉంచాలి. పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఇల్లు శుభ్రంగా, అందంగా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

2.ఇంటి ముఖద్వారం: ఇంటి ముఖద్వారం కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి...