Hyderabad, సెప్టెంబర్ 6 -- చాలా మంది వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ మధ్య తికమకకు గురవుతారు. వాస్తు శాస్త్రం ఇంటి డిజైన్ మరియు దిశపై దృష్టి పెడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అదే సమయంలో ఫెంగ్ షుయ్ ఇంటి అలంకరణ, రంగు, అమరికను తెలుపుతుంది. అదే సమయంలో ఫెంగ్ షుయ్ లోని కొన్ని వస్తువుల ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఫెంగ్ షుయ్ ప్రకారం ఏం చేస్తో మంచిదో ఈరోజు మాట్లాడుకుందాం.

ఇద్దరు వ్యక్తులు గొడవ పడటం సర్వసాధారణం. ఇవన్నీ ప్రతి రోజూ జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా చిన్న చిన్న గొడవలు జరిగి, అక్కడి నుంచే సమస్యలు మొదలవుతాయి. మీ వైవాహిక జీవితాన్ని తిరిగి సంతోషంగా ఉంచే కొన్ని ఫెంగ్ షుయ్ చిట్కాలను ఇక్కడ చూడచ్చు. ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలను పాటిస్తే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

గదిని వస్తువులతో నింపవద్దు. వస...