భారతదేశం, నవంబర్ 28 -- ఐక్యరాజ్యసమితి బాలల నిధి (UNICEF) గుడ్ విల్ అంబాసిడర్‌గా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ డేవిడ్ బెకహమ్, నటి సమంత రూత్ ప్రభుతో ముంబైలో ఓ కార్యక్రమంలో కనిపించారు. వారిద్దరూ కలిసి ఓ ఈవెంట్ నుండి బయటకు వస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరినీ చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఈవెంట్ నుండి బయటకు వస్తున్నప్పుడు డేవిడ్, సమంతలను ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. కారు ఎక్కే ముందు వీరిద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. డేవిడ్ సింపుల్‌గా బ్లాక్ టీ-షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లో కనిపించగా, సమంత గ్రే పిన్‌స్ట్రైప్ సూట్‌లో స్టైలిష్‌గా ఉంది. కారు ఎక్కే ముందు డేవిడ్ అభిమానులతో సెల్ఫీలు దిగి, ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చారు.

డేవిడ్, సమంత కలిసి కనిపించడంతో అభిమానులు ఆ...