భారతదేశం, జనవరి 29 -- ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేసింది. సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన 'ఛాంపియన్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళే (జనవరి 29) ఓటీటీీలో అడుగుపెట్టింది ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్లలో ఛాంపియన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా హిట్ గా నిలిచింది.

రోషన్ మేక, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ మూవీ వ్యూయర్స్ కు అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఛాంపియన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

పెళ్లి సందD మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ మేక. ఆ తర్వాత మళ్లీ ఛాంపియన్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ ఛాంపియన్ సినిమా 2025 డ...