భారతదేశం, సెప్టెంబర్ 14 -- రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంతు సర్కారు మొద్దు నిద్ర నటిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని చెప్పారు.

'అల్లరి చేయొద్దు.. అని ఆర్థిక మంత్రి చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రి కమీషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయి? ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డీఏలు ఇవ్వమంటే నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు అని చెప్పిన ముఖ్యమంత్రి లక్షల కోట్ల టె...