Hyderabad, జూలై 17 -- ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా జూనియర్. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. జూలై 18న జూనియర్ విడుదల కానుంది.

ఈ సందర్భంగా తాజాగా జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జెనీలియా, కిరీటి, సెంథిల్, దేవి శ్రీ ప్రసాద్ తదితర టెక్నిషియన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ రాజమౌళి.

ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్ గారు, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్...