భారతదేశం, ఆగస్టు 20 -- ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఈ ఉదయం తన నివాసంలో దాడి జరిగింది. తన నివాసంలో జరిగిన 'జాన్ సున్‌వాయ్' కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి వేషంలో వచ్చి దాడి చేశాడు. జాన్ సున్‌వాయ్ కార్యక్రమం అనేది పౌరుల ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక చొరవ.

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. కార్యక్రమానికి ఫిర్యాదుదారుడిలా వేషంలో వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు. దాడి తర్వాత వెంటనే ముఖ్యమంత్రిని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆమె నివాసానికి చేరుకుని భద్రతను పెంచారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యమంత్రి ప్రతి వారం తన నివాసంలో జరిగే జన్ సున్‌వాయ్ సమావేశానికి హాజరవుతారు.

30 సంవత్...