భారతదేశం, నవంబర్ 17 -- సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌ను హెచ్చరించింది. తెలంగాణ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

జులై 31,2025న అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా కేటీఆర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్త...