భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఇలాంటి పాట తన కెరీర్ లో ఇంతవరకూ వినలేదంటూ ఓ వైపు డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇంత అద్భుతమైన పాట చేసే ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఇంకోవైపు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఇద్దరూ కలిసి హైప్ పెంచేసిన సాంగ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్'. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఈ రెండో పాట రిలీజ్ ఎప్పుడూ? అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది. ఎట్టకేలకు ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పాటను ఫిబ్రవరి 22న రిలీజ్ చేయబోతున్నట్లు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ తో సస్పెన్స్ కు తెరదించారు.

''మనం ప్రేమించే మనిషి. మనం సెలబ్రేట్ చేసుకునే మనిషి. పవర్ ఫుల్ ఆంథెమ్ లో పవర్ స్టార్ ...