భారతదేశం, జనవరి 1 -- గ్రేటర్ హైదరాబాద్‌లో మరో కోత్త అధ్యాయం మెుదలుకాబోతోంది. ఇటీవల ఓఆర్ఆర్‌ వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) హోదా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. 2025 డిసెంబర్ 31, బుధవారం నాడు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 2026 వరకు కార్పొరేషన్ యథాతథంగా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్వీ కర్ణన్ చెప్పిన మాటలు బలం చేకూర్చాయి. ఫిబ్రవరిలో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

ఒక్కో క్లస్టర్‌కు ముగ్గురు జోనల్ కమిషనర్ల చొప్పున...