భారతదేశం, జనవరి 27 -- ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్ భారీగా పతనాన్ని చూసింది. లక్షల కోట్లు నష్టపోయాయి. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 19 ట్రేడింగ్ రోజులు మాత్రమే గడిచినా.. మార్కెట్ భారీ పతనాన్ని చూసింది. సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్ 800 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ పతనం తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.10 లక్షల కోట్లు నష్టపోయారు.

ఇంతలో మరో వార్త స్టాక్ మార్కెట్‌ను భయపెడుతోంది. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే ప్రసిద్ధ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి స్టాక్ మార్కెట్ గురించి పెద్ద జోస్యం చెప్పారు. 2025 ఫిబ్రవరిలో చరిత్రలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం జరగబోతోందని ఆయన అన్నారు. ఈ మేరకు అందరినీ అప్రమత్తం చేస్తూ.. ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఫిబ్రవరిలో వచ్చే స్టాక్ మార్కెట్ క్రాష్.. అంతకుముందు జరిగిన పతనాల కంటే చాలా పెద్దగా ఉంట...