భారతదేశం, జూలై 20 -- విదేశాల్లో చదువు కోసం భారత విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. వీరిలో చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్నారు. అయితే, చదువు విషయంలో యూరోపియన్​ దేశమైన ఫిన్లాండ్​ కూడా ఒక మంచి ఆప్షన్​ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థకు ఫిన్లాండ్ విస్తృతంగా గుర్తింపు పొందింది. ఇది సిద్ధాంతం- ఆచరణ రెండింటిలోనూ పరిశోధన-ఆధారిత బోధనా పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా, ఫిన్లాండ్‌లోని ప్రతి ఉపాధ్యాయుడు బోధనలో అధికారిక అర్హతలతో పాటు మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి! మరి ఫిన్లాండ్​లో చదువు కోసం భారతీయ విద్యార్థులకు ఎంత ఖర్చు అవుతుంది? ట్యూషన్​ ఫీజు ఎంత? అక్కడ కాస్ట్​ ఆఫ్​ లివింగ్​ ఎలా ఉంటుంది? ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ ప్రకారం.. ఫిన్లాండ్‌లో చదువుతున్నప్పుడు అంతర్జాతీయ- భారతీయ విద్య...