Hyderabad, ఏప్రిల్ 15 -- వేసవిలో ఎండ, వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది ఎక్కువగా నీరు త్రాగుతారు. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. అలాంటి సమయంలో ఆకలిని, రుచిని పెంచేది ఆవకాయే. అప్పుడే కాసిన మామిడికాయలను తెచ్చుకుని పచ్చడి చేసుకుని తినడం ఎవరికి నచ్చదు చెప్పండి. ఆవకాయ పచ్చడితో కుంబాలు కుంబాలు లాగించేసే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ కొందరు ఆవకాయ అంటేనే మనసులో నూనె, మసాలాలతో నిండిన వంటకంగా ఫీలవుతారు.

ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రియులు దీన్ని తినడానికి భయపడతారు. మీరు కూడా ఫిట్‌నెస్ ప్రియులే అయితే ఆవకాయ రుచిని ఆస్వాదించడంతో పాటు పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనుకుంటే, ఈ జీరో ఆయిల్ మామిడి ఆవకాయ రెసిపీని ట్రై చేయండి. ఇది ఇతర మామిడికాయ పచ్చడి రెసిపీలకన్నా భిన్నంగా, చాలా రుచికరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇందులో చుక్క నూనెను కూడా ఉపయోగించరు. నూనె లేక...