భారతదేశం, జనవరి 14 -- బయటికి ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపిస్తారు.. జిమ్‌కు వెళ్తారు, చురుగ్గా ఉంటారు. కానీ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఇటీవల భారత్‌లో 18 నుంచి 45 ఏళ్ల యువతలో పెరిగిన ఈ ఆందోళనకర ధోరణిపై ఎయిమ్స్-ఐసీఎంఆర్ (AIIMS-ICMR) 2025లో చేపట్టిన అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాల్లో 42.6 శాతం మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమని ఈ పరిశోధన తేల్చింది.

చాలామంది యువకులు తాము ఆరోగ్యంగా ఉన్నామని, తమకు ఎలాంటి లక్షణాలు లేవని భావిస్తుంటారు. అయితే, ముంబైలోని డాక్టర్ ఎల్.హెచ్. హిరానందని హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రతీక్ గిరి ఈ విషయంలో కీలక హెచ్చరికలు చేశారు.

"బయటికి ఆరోగ్యంగా కనిపించడం అంటే గుండె సంపూర్ణంగా పనిచేస్తోందని అర్థం కాదు. చాలా సందర్భాలలో ముప్పు కారకాలను ప్రాథమి...