భారతదేశం, ఆగస్టు 2 -- ఫిక్స్‌డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ప్రముఖ బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఎఫ్‌డీలో అందిస్తున్నాయి. అయితే ఏ బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తాయో మీరు తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమావేశం ఆగస్టులో జరగనున్నందున దానికి ముందు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై నిఘా ఉంచాలి. ఎందుకంటే రెపో రేటు మరింత తగ్గితే.. ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది.

అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ 2 నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 18 నుండి 21 నెలల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌లపై 6.6 శాతం వడ్డీని అందిస్తుంది. సీని...