భారతదేశం, డిసెంబర్ 18 -- ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోతున్నాడు. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సిరీస్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' రాబోయే సీక్వెల్ 'ఫాస్ట్ ఎక్స్: పార్ట్ 2'లో రొనాల్డో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఈ స్టార్ ఫుట్‌బాలర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో దుమ్మురేపడానికి రెడీ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్న 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీలో రొనాల్డో జాయిన్ అయ్యాడు. ఇది క్రీడా ప్రపంచం, సినిమా ప్రపంచం కలిసే అతిపెద్ద 'క్రాస్ ఓవర్' అని చెప్పుకోవచ్చు. రొనాల్డో రాక ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీని మరింత ఆసక్తికరంగా మార్చింది.

ఈ న్యూస్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఆ సినిమా నటుడు టైరెస్ గిబ్సన్ ...