Telangana,hyderabad, సెప్టెంబర్ 10 -- ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ. కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు సర్కార్ కు సమర్పించిన నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొన్నట్లు తెలిసింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డిలపై ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అనుమతి ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు (చార్జిషీట్ దాఖలు) ప్రారంభిస్తామని నివేదికలో పేర్కొంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేసును నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం అనధికారిక చెల్లింపులు చేశారన్న అభియోగాలు వచ్చాయి. ఈ కేస...