భారతదేశం, డిసెంబర్ 12 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసిన దివ్వెల మాధురి ఓ వివాదం చిక్కుకుంది. అనుమతి లేకుండా నిర్వహించిన ఫామ్ హౌజ్ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆమె పాల్గొందని, వీళ్లను పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దివ్వెల మాధురి మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి అసలు ఏం జరిగిందో చూద్దాం.

గురువారం (డిసెంబర్ 11) రాత్రి మొయినాబాద్ లో ని పెండెంట్ ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. దీనికి పోలీసుల అనుమతి లేదు. పోలీసులు రైడ్ చేస్తే విదేశీ మద్యం బాటిళ్లు, హుక్క పాట్స్ దొరికాయని చెబుతున్నారు. అయితే ఇందులో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ రోజు (డిసెంబర్ 12) మాధురి బర్త్ డే కాబట్టి నిన్న శ్రీనివాస్ ఈ పార్టీ అరెంజ్ చేశారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫామ్ హౌజ్ మందు పార్టీ, పోలీసుల రైడ్...