భారతదేశం, జూన్ 15 -- సెలబ్రిటీ పిల్లలు ఘనంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో వాళ్ల నాన్నలు ఫొటోలు పోస్టు చేస్తున్నారు. ఆదివారం (జూన్ 15) ఫాదర్స్ డే సందర్భంగా తమ పిల్లలతో స్టార్ హీరోలు ఉన్న ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్, యష్, మహేష్ బాబు వంటి దక్షిణ సూపర్ స్టార్లు తమ పిల్లల నుండి మధురమైన శుభాకాంక్షలు అందుకున్నారు. ఇది ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేసింది.

అల్లు అర్జున్ స్టోరీ

అల్లు అర్జున్.. తన పిల్లలు అయాన్, అర్హ నుండి అందుకున్న ఒక తీపి ఆశ్చర్యాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. చెర్రీలతో అలంకరించిన చాక్లెట్ కేక్, "హ్యాపీ ఫాదర్స్ డే" అని రాసి ఉన్న వైట్ చాక్లెట్ ఫలకాన్ని బన్నీకి బహుమతిగా ఇచ్చారు. కానీ ఈ ఫాదర్స్ డే రోజు అల్లు అర్జున్ తన పిల్లలను మిస్ అవుతున్నట్లు తెలిసింది. ఈ కేక్ ఫొటోను పంచుకున్న అల్లు అర్జున్.. ...