Hyderabad, జూన్ 30 -- ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో బ్రాడ్ పిట్ నటించిన రేసింగ్ డ్రామా 'F1' ఒకటి. జోసెఫ్ కోసిన్స్కి డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. విడుదలైన తొలి వీకెండ్ లో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ డ్రామాకు అభిమానులు, విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా 'వెరైటీ' రిపోర్టు ప్రకారం, ఈ సినిమా దేశీయంగా విడుదలైన మొదటి వీకెండ్ లో 55.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 470 కోట్లు) వసూలు చేసింది.

'వెరైటీ' నివేదిక ప్రకారం, 'F1' సినిమా 50 మిలియన్ డాలర్ల నుండి 60 మిలియన్ డాలర్ల అంచనాలకు తగ్గకుండా మంచి వసూళ్లను సాధించింది. ఇది ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలో భాగం కానప్పటికీ.. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు చాలా మెరుగ్గా ఉన్నాయి.

అయితే 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను బ్రేక్ ఈవెన్ చేయడానికి, సినిమా మొదటి ...