భారతదేశం, నవంబర్ 11 -- ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలను మొబైల్ ఫోన్లలో సందేశాలు పంపడం ద్వారా అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘించినందుకు మాత్రమే చలాన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట మరణాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించడంలో కేరళ అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని అధికారులకు చెప్పారు.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ప్రతిసారి చలాన్లు జారీ చేసి ప్రజలను భయపెట్టడం మంచిది కాదని సీఎం అన్నారు. 'నిబంధనలను ఉల్లంఘించేవారి మొబైల్ ఫోన్లకు అధికారులు ముందుగా సందేశాలు పంపాలి. హ...