భారతదేశం, డిసెంబర్ 25 -- యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా యూరియాను ఈజీగా బుక్ చేయవచ్చు. ఇందుకోసం అన్నదాతలు Fertilizer Booking App ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎరువులు అందరికీ అందేలా, అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ లింక్ క్లిక్ చేసి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం రైతులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ఎరువులు(ప్రస్తుతం యూరియా మాత్రమే అందిస్తారు) బుక్ చేసుకునేందుకు Fertilizer Booking Mobile Appను తీసుకొచ్చింది. యాప్‌ను ఎలా ఉపయోగించాలి అని కొందరికి అనుమానాలు ఉన్నాయి. మీ కోసం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ ఉంది. యాప్ పేరు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. అయితే ప్రస్తుతానికి యూరియా మాత్రమే బుక్ చేయవచ్చు. యాప్ డౌన్‌లోడ్ ...