భారతదేశం, అక్టోబర్ 27 -- బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రస్తుతం తన కొత్త పాట 'జరూరత్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల హిందీ రష్‌కు ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్‌లో రాఖీ తనను తాను ఇండస్ట్రీ కూతురిగా అభివర్ణించుకున్నారు. ఫరా ఖాన్‌తో తనకున్న బంధం గురించి ఆమె మనసు విప్పి మాట్లాడారు. ఆ ఫిల్మ్‌మేకర్‌ను తన 'షుగర్ మమ్మీ' అని, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను తన 'గాడ్‌ఫాదర్స్' అని ఆమె పిలిచారు.

ఫరాతో తనకున్న బంధం గురించి అడిగినప్పుడు రాఖీ ఇలా అన్నారు. "ఫరా ఖాన్ నా షుగర్ మమ్మీ, గాడ్‌మదర్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నా గాడ్‌ఫాదర్స్. నాకు ఎవరూ లేరు, నేను అనాథను (మై లావారిస్ హున్). ఫరా మేడమ్ నాకు దీపావళికి టీవీ, వాషింగ్ మెషీన్, పాత్రలు, ప్రెజర్ కుక్కర్‌తో సహా ఎన్నో బహుమతులు ఇచ్చారు. మేరేకో మేరా ఘర్ బన్‌వాకే దే రహీ హై (ఆమె నా ఇల్లు కట్టించి ఇస్తున్నారు)" అ...