భారతదేశం, డిసెంబర్ 19 -- మాస్ మహారాజా రవితేజ చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలుసు కదా. ఇప్పుడో ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి సినిమాగా వస్తున్న ఈ మూవీపై రవితేజ భారీ ఆశలే పెట్టుకోగా.. మూవీని జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.

కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టీజర్ ను శుక్రవారం (డిసెంబర్ 19) రిలీజ్ చేశారు. ఇందులో పెళ్లయిన తర్వాత విదేశానికి వెళ్లి మరో అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ విషయం తన భార్యకు తెలియకుండా ఉండేందుకు తంటాలు పడే భర్తగా రవితేజ కనిపించాడు. అతని భార్య పాత్రలో డింపుల్ హయతి, ప్రేయసిగా ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో నటించారు. 90 సెకన్ల ఈ మూవీ టీజర్ ఫన్నీగా సాగిపోయింది. ఇందులో ఓ సైకాలజిస్ట్ పాత్రలో మురళీధర్ గౌడ్ నవ్వించాడు. ఈ ...