Hyderabad, జూలై 25 -- స్టార్ మా ఛానెల్లో ఈ వీకెండ్ అభిమానులను అలరించడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రోమోలను శుక్రవారం (జులై 25) ఆ ఛానెల్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది. మరి ఆ ప్రోగ్రామ్స్ ఏంటి? ఎప్పుడు చూడాలన్నది తెలుసుకోండి.

స్టార్ మా ఈ వీకెండ్ తన ఛానెల్లో టెలికాస్ట్ కానున్న ప్రోగ్రామ్స్ ప్రోమోలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. వీటిలో ఫన్, రొమాన్స్, ఆధ్యాత్మికం.. ఇలా అన్ని రకాల కార్యక్రమాలూ ఉండటం విశేషం. మొదట ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న షో కుకు విత్ జాతిరత్నాలు విషయానికి వద్దాం. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఈవారం మరింత ఫన్ అందించనున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

ఈసారి ఫేమస్ టీవీ పర్సనాలిటీస్ ప్రభాకర్, బిత్తిరి సత్తిలాంటి సెలబ్రిటీలు వంటలు చేయడాన...