భారతదేశం, జనవరి 10 -- వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న రవితేజ ఇప్పుడు 'భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం (జనవరి 10) రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రవితేజ, పవన్ కల్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ''సినిమా ఆడిందా, ఓడిందా అనేది పట్టించుకోడు. తెల్లారి షూటింగ్ కు వస్తాడు. భగవద్గీతలో చెప్పినదాన్ని అర్థమయ్యేలా చెప్తా. బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఫ్లాఫ్ వచ్చినప్పుడు కుంగిపోవద్దు. మరి ఆయన (రవితేజ) భగవద్గీత చదువుకున్నారో లేదో నాకు తెలియదు. దీన్ని స్థితప్రజ్ఞత అంటారు'' అని...