భారతదేశం, ఆగస్టు 31 -- ప్లే స్టోర్‌లోని చాలా యాప్‌లపై వేటు వేసింది గూగుల్. ఎందుకంటే ఇవి వినియోగదారలుకు హానిచేసేవిగా ఉన్నాయి. ఈ మేరకుప్లే స్టోర్ నుంచి 77 హానికరమైన యాప్‌లను గూగుల్ తొలగించింది. ఈ యాప్‌ను తొలగించడానికి ముందు మొత్తం 19 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేశారు. ఆ యాప్స్ అన్నీ వినియోగదారుల సేఫ్టీకి ముప్పుగా ఉన్నాయి.

గూగుల్ 2024లోనే దాదాపు 40 లక్షల యాప్స్‌ను తొలగించింది. అంటే రోజుకు 11 వేల యాప్స్ ను తొలగించారు. ఈ తొలగింపుల్లో సగానికి పైగా డేటా భద్రతా, గోప్యత ఉల్లంఘనలకు సంబంధించినవని తెలిపింది. అంతేకాదు ఈ విధానాన్ని ఉల్లంఘించినందుకు గూగుల్ సుమారు 1,55,000 డెవలపర్ ఖాతాలను నిషేధించింది. వాస్తవానికి, గూగుల్ గత సంవత్సరం యాప్స్ కోసం నిబంధనలను కఠినతరం చేస్తామని చెప్పింది.

గూగుల్ ఈ ఏడాది సుమారు 1.55 లక్షల డెవలపర్ ఖాతాలను కూడా బ్లాక్ చేసింది. ఇ...