భారతదేశం, జూలై 12 -- యెర్సినియా పెస్టిస్ (Yersinia pestis) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యుమోనిక్ ప్లేగు అనే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో అమెరికాలోని అరిజోనాలో ఒకరు చనిపోయారు. సకాలంలో చికిత్స అందించకపోతే ప్లేగు ప్రాణాంతకం కావచ్చని సీడీసీ (Centers for Disease Control and Prevention) హెచ్చరిస్తోంది. అరిజోనాలో ప్లేగు వ్యాధితో ఒక వ్యక్తి చనిపోయినట్లు యూఎస్‌ఏ టుడే నివేదించింది. ప్రజారోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు రోగికి తీవ్రమైన ప్లేగు సోకింది. ప్రాణాలను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రోగి కోలుకోలేకపోయారు.

నార్తర్న్ అరిజోనా హెల్త్‌కేర్ (NAH) జూలై 11న ఇచ్చిన ఒక ప్రకటనలో "ఫ్లాగ్‌స్టాఫ్ మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో మేం ఇటీవల ఒక రోగికి చికిత్స అందించాం. సరైన ప్రారంభ చికిత్స, ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు చ...