భారతదేశం, జూలై 28 -- రియల్ ఎస్టేట్ రంగం చాలా మందికి సురక్షితమైన, అత్యంత లాభదాయకమైన పెట్టుబడి ఆప్షన్. ఆస్తిని కొనడం అనేది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలలో ఒకటి అని గుర్తుంచుకోవాలి. మీరు కూడా ఆస్తిని కొనాలనుకున్నప్పుడు ప్లాట్ లేదా ఫ్లాట్ ఏది బెటర్ అనే క్వశ్చన్ వస్తుంది. ప్లాట్లు దీర్ఘకాలంలో వేగంగా విలువను పెంచుతాయి. ఫ్లాట్లు తక్షణ నివాసం, అద్దె ఆదాయం, సులభమైన రుణాలు, పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా సరైన ఎంపిక చేసుకోవాలి.

మొదటిసారి ఆస్తి కొనుగోలు చేసేవారికి ప్లాట్ కొనాలా లేక ఫ్లాట్ కొనాలా అనే విషయంలో గందరగోళం చెందడం సహజం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుపై ఎక్కడ ఎక్కువ రాబడి వస్తుందో చూసుకోవాలి. సులభమైన ఫైనాన్సింగ్, అధిక రాబడి, పన్ను ప్రయోజనాలు వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్లాట్లు, ఫ్లాట...