భారతదేశం, డిసెంబర్ 28 -- బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ మూవీ దుమ్ము రేపుతూనే ఉంది. ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. మూడో వారం వీకెండ్ ను కూడా గొప్పగా ముగించేలా కనిపిస్తోంది. ఈ సినిమా శనివారం (డిసెంబర్ 27) కూడా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ రికార్డును బ్రేక్ చేసింది ధురంధర్.

బాలీవుడ్ నటుడు ర‌ణ్‌వీర్ సింగ్‌ చిత్రం 'ధురంధర్' తన దూకుడును కొనసాగిస్తోంది. సెలవుల సీజన్ లో సత్తాచాటుతోంది. న్యూ ఇయర్ ముందు ఈ సినిమాకు ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది. ఇటీవల ఇండియాలో రూ. 650 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు రూ. 700 కోట్ల మైలురాయి వైపు దూసుకుపోతోంది.

ధురంధర్ 23వ రోజు ఇండియాలో రూ.20.50 కోట్ల నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. 22వ రోజుతో పోలిస్తే 23వ రోజు సినిమా కలెక్షన్లలో సుమారు 36.67% వృద్ధిని సాధించింది. దీంతో...