భారతదేశం, జనవరి 10 -- ప్రభాస్ తాజా చిత్రం 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, మిక్స్ డ్ టాక్ వినిపించినప్పటికీ ది రాజా సాబ్ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ హారర్-కామెడీ చిత్రం మొదటి రోజు (గురువారం ప్రీవ్యూలతో సహా) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

రాజా సాబ్ కలెక్షన్లు

హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ రాజా సాబ్ ఫస్ట్ డే అదరగొట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

"కింగ్ సైజ్ బాక్స్ ఆఫీస్ డామినేషన్ తో ప్రతి కోటలో ఒక కొత్త బెంచ్మార్క్ సెట్ చేసింది ది రాజా సాబ్. ఒక హారర్ ఫాంటసీ చిత్రానికి ఇదే అతిపెద్ద ప్రారంభం" ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎక్స్ లో పేర్కొంది.

కొత్త రికార్డు

రాజా సాబ్ మేకర్స్ చెప్పి...