భారతదేశం, మే 25 -- బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు మరోసారి మార్మోగుతోంది. అనూహ్యంగా ఆమె గోల్డెన్ ఛాన్స్ పట్టేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న 'స్పిరిట్' మూవీలో హీరోయిన్ గా త్రిప్తి ఎంపికయ్యారు. ప్రభాస్ పక్కన ఫీమేల్ లీడ్ రోల్ కోసం దీపిక పదుకోణ్ ను సెలెక్ట్ చేస్తారని అంతా అనుకుంటుండగా.. త్రిప్తి పేరు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు సందీప్. దీనిపై ఫ్యాన్స్ రియాక్షన్స్ వైరల్ గా మారాయి. డైరెక్టర్ ఆర్జీవీ కూడా రియాక్టయ్యారు.

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో త్రిప్తి డిమ్రి ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారని సందీప్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఎక్స్ లోనూ పోస్టు చేశారు. ఈ పోస్టును షేర్ చేస్తూ ఆర్జీవీ చేసిన కామెంట్లు వైరలవుతున్నాయి.

''హే.. సందీప్ రెడ్డి వంగా, యానిమల్ మూవీలో మీరు చూపించిన ఆమె స్క్రీన్ ప్ర...