భారతదేశం, జనవరి 10 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చుట్టూ నెలకొన్న వివాదాల నేపథ్యంలో సీనియర్ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తీకరణ స్వేచ్ఛ, సినీ పరిశ్రమలో సెన్సార్ ప్రక్రియపై విస్తృతమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏ సంస్థ లేదా నిర్దిష్ట సినిమా పేరును ప్రస్తావించకుండా కమల్ హాసన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఇటీవల జన నాయగన్ సెన్సార్ ఇష్యూపైనా ఆయన స్పందించారని అర్థమవుతోంది.

"భారత రాజ్యాంగం హేతుబద్ధతతో కూడిన వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. పారదర్శకత ఎన్నడూ తగ్గదు. ఇది కేవలం సినిమా గురించి మాత్రమే కాదు. అంతకంటే పెద్దది. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో మనం కళలకు, కళాకారులకు ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ విలువ లేకుండా పోతుంది. సినిమా కేవలం వ్యక్తి కృషి మాత్రమే కాదు.. రచయితలు, సాంకేతిక ...