భారతదేశం, మే 16 -- ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్‌ అగ్రి యూనివర్శిటీలో అగ్రికల్చర్‌, ఫుడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. అగ్రికల్చర్ అనుబంధ కోర్సుల్లో రెగ్యులర్ సీట్లు, స్పెషల్ క్యాటగిరీ, ఎన్నారై సీట్లను భర్తీ చేయనున్నారు. వెస్ట్రర్న్‌ సిడ్నీ యూనివర్శిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న డ్యుయల్ డిగ్రీ, పీజీ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీలో బిఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌లో రెగ్యులర్ క్యాటగిరీలో 615 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లకు సెమిస్టర్‌కు ర...