భారతదేశం, నవంబర్ 11 -- బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ ఈ సంవత్సరం సినీ రంగంలోకి తిరిగి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు నటించిన 'ధురంధర్' మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతుండగా.. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. సినిమా కెరీర్‌లో పునరుత్తేజం పొందుతున్న రణవీర్ సింగ్.. తన వ్యాపారంలో కూడా భారీ లాభాలను చవిచూస్తున్నాడు. రణవీర్ సింగ్ సహ-యజమానిగా ఉన్న వేఫర్ బ్రాండ్ 'SuperYou' కేవలం ఏడాదిలోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని దాటినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

రణవీర్ సింగ్, నికుంజ్ బియానీతో కలిసి స్థాపించిన స్నాకింగ్ బ్రాండ్ 'SuperYou'. ఈ కంపెనీ ప్రకటన ప్రకారం రూ.100 కోట్ల ఆదాయాన్ని దాటేసింది. తాజాగా కొత్త మల్టీగ్రెయిన్ ప్రోటీన్ చిప్స్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ బ్రాండ్.. రాబోయే ఐదేళ్లలో రూ.500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ఈ వి...