భారతదేశం, అక్టోబర్ 30 -- ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధుల కిందకు వచ్చే అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, కళాశాలలను సమగ్రంగా తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడానికి, పేద, వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా? తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది.

విజిలెన్స్ బృందాలు తెలంగాణ అంతటా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, B.Ed కోర్సులను అందించే ప్రొఫెషనల్ కళాశాలలతో పాటు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలను తనిఖీ చేస్తాయి. ఈ తనిఖీలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీసు కమిషనరేట్ల మద్దతుతో న...