Telangana,hyderabad, జూలై 11 -- రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్‌ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 6 వారాల్లోగా ఇంజినీరింగ్‌ ఫీజులను ఫిక్స్‌ చేయాలని ఫీజుల నియంత్రణ కమిటీకి ఆదేశాలను ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో.గతేడాది ఉన్న ఫీజులే అమల్లో ఉండనున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....