భారతదేశం, జూన్ 22 -- చైనీస్ మూలాలున్న బ్రిటీష్ ఎంపీ రాసిన ఈ పుస్తకం, తెర వెనుక దాగివున్న నలుగురు చైనీస్ మహిళల కథల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మారుతున్న ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ బతుకుపోరాటం ఎలా సాగిందో తెలుసుకుందాం.

జూన్‌ అనే యువతికి వారంలో దొరికే కాస్తంత తీరిక సమయం ఆదివారం మధ్యాహ్నాలు. ఆ సమయంలో ఆమె బట్టలు చేతులతో ఉతుకుతూ, ఈ పనికి తనెంత సమయాన్ని వృథా చేస్తున్నానో అని లోలోపల ఉడుక్కునేది. ఆ బోర్ కొట్టే పనినించి తప్పించుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌లో పాడ్‌కాస్ట్‌లు వినేది. ముఖ్యంగా, చైనాలో పెద్ద ప్రైవేటు విద్యా సంస్థ 'న్యూ ఓరియంటల్' వ్యవస్థాపకుడు యు మిన్‌హోంగ్ ప్రసంగాలు ఆమెకు బాగా నచ్చేవి.

2013 ప్రాంతంలో జూన్ హైస్కూల్లో చేరినప్పుడు యు జీవితం ఆధారంగా 'అమెరికన్ డ్రీమ్స్ ఇన్ చైనా' అనే ఓ సినిమా విడుదలైంది. నవ్వులు పూయించే హాస్యంతో సాగే ఈ కథ, పే...