భారతదేశం, నవంబర్ 7 -- ఫీజు బకాయిలపై తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రభుత్వం. కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు నిర్వహించారు. కాలేజీలతో జరిపిన చర్చలు సఫలం కావటంతో.. రేపట్నుంచి బంద్‌ విరమిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి.

ప్రైవేట్ కాలేజీల బకాయిలలో ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని హామీనిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి, యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలను చర్చిస్తామని వివరించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ...