Hyderabad, జూన్ 4 -- థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో మనకు తెలుసు. తాజాగా ప్రైమ్ వీడియోలోకి అలాంటి థ్రిల్లర్ మూవీయే ఒకటి నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి హడావుడి, ప్రచారం లేకుండానే ప్రైమ్ వీడియోలో బుధవారం (జూన్ 4) విడుదలైన 'స్టోలెన్' (Stolen) అనే సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఒవేషన్ పొందిన ఈ మూవీ, ఇండియాలోని గ్రామీణ ప్రాంతాల కఠిన వాస్తవాలను, మానవత్వం కోసం జరిగే పోరాటాన్ని చాలా వాస్తవిక రీతిలో చూపించింది.

కరణ్ తేజ్‌పాల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ థ్రిల్లర్ చిత్రంలో ఇద్దరు సోదరులు (అభిషేక్ బెనర్జీ, శుభమ్ వర్ధన్) ఒక గిరిజన మహిళకు చెందిన బిడ్డ కిడ్నాప్ కేసులో ఎలా చిక్కుకుంటారు అనేది ప్రధాన కథాంశం. సినిమాలోని సస్పెన్స్‌తో కూడిన కథనం, ప్రతి సన్నివేశంలో ప్ర...