Hyderabad, జూన్ 3 -- థియేటర్లలో డిజాస్టర్ అయినా ఓటీటీలో దుమ్ము రేపడం ఈ మధ్య కామనైపోయింది. అలాంటివే రెండు తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో దూసుకెళ్తున్నాయి. వీటిలో ఒకటి రొమాంటిక్ కామెడీ కాగా.. మరొకటి కామెడీ మూవీ కావడం విశేషం. ఇక మొత్తంగా టాప్ 10లోనూ ఐదు తెలుగుకు సంబంధించినవే ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే అడుగుపెట్టిన సినిమాలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, సారంగపాణి జాతకం. ఈ రెండు మూవీస్ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. కానీ ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం ఇవి రెండూ టాప్ 2 ట్రెండింగ్ లో నిలవడం విశేషం.

యాంకర్ ప్రదీప్, దీపిక పిల్లి లీడ్ రోల్స్ లో నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఇండియాలోనే నంబర్ వన్ ట్రెండింగ్ మూవీగా నిలుస్తోంది. దీని తర్వాత ప్రియదర్శి లీడ్ రోల్లో ...