Hyderabad, మే 12 -- తమన్నా నటించిన మూవీ ఓదెల 2. ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే గత శుక్రవారం (మే 9) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన తర్వాత మాత్రం దుమ్ము రేపుతోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.

తమన్నా నటించిన ఓదెల 2 మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాను మేకర్స్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేసినా.. ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. హిట్ మూవీ ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్ గా వచ్చినా.. ఈ ఓదెల 2 అంతగా ప్రభావం చూపలేకపోయింది. సంపత్ నంది కథ అందించిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు సొంతం చేసుకుంది.

ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతోంద...