Hyderabad, జూలై 7 -- ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన థ్రిల్లర్ మూవీ పుణె హైవే (Pune Highway). ఈ ఏడాది మే 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. జులై 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించకపోయినా.. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో మాత్రం టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా దూసుకెళ్తోంది. మరి ఈ పుణె హైవే ఎందో చూడండి.

పుణె హైవే ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీ నలుగురు స్నేహితులు ప్రమోద్ (అమిత్ సాధ్), నటాషా (మంజరి ఫడ్నిస్), విష్ణు (జిమ్ సర్బ్), నికొలస్ థామస్ (అనువబ్ పాల్) చుట్టూ తిరుగుతుంది. వీళ్లలో ప్రమోద్ ఓ ప్రముఖ పొలిటీషియన్ మధుసూదన్ మన్సేఖర్ (శిశిర్ శర్మ)కు ఆప్తుడిగా ఉంటాడు. విష్ణు ఓ లాయర్ కాగా.. నికొలస్ సినిమా తీయాలనే పట్టుదలతో ఉంటాడు.

ఇక మన్సేఖర్ కూతురు అయిన మోనా మన్సేఖర్ (కేతకి నారాయణ్) హత్యకు గురవుతుంది. సి...