భారతదేశం, అక్టోబర్ 27 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) తరచూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. వీటిలో చాలా వరకు అమెజాన్ ప్రైమ్ సొంతంగా రూపొందించే ఒరిజినల్స్ ఉంటాయి. ఈ సినిమాలు, సిరీస్‌లు మీకు మరే ఇతర ప్లాట్‌ఫామ్స్ లోనూ కనిపించవు. అయితే ఈ కేటగిరీలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా? వీటిని రూపొందించడానికి వందల కోట్లు ఖర్చు చేసింది. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ 3 అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ గురించి తెలుసుకోండి.

ఇది భవిష్యత్తులో జరిగే యుద్ధం కథ. ఈ యుద్ధంలో మనుషులు ఓడిపోతే.. మొత్తం మానవాళి అంతమైపోతుంది. భవిష్యత్తులో ఏలియన్స్‌తో జరుగుతున్న ఈ యుద్ధంలో మనుషులు తక్కువ అవుతుండడంతో, ఒక టైమ్ ట్రావెల్ టెక్నిక్‌ను ఉపయోగించి గతం నుంచి ప్రజలను తీసుకువస్తారు. ఈ సినిమాను నిర్మించడానికి...