భారతదేశం, జనవరి 30 -- క్రైమ్ థ్రిల్లర్ల మూవీస్, వెబ్ సిరీస్ లలో సాధారణంగా "హంతకుడు ఎవరు?" అనే ఉత్కంఠ చివరి వరకు ఉంటుంది. కానీ సురేష్ త్రివేణి రూపొందించిన 'దల్దల్' వెబ్ సిరీస్‌లో రెండో ఎపిసోడ్‌లోనే కిల్లర్ ఎవరో, హత్యలు ఎలా చేస్తున్నారో చూపించేస్తారు. అయినా సరే ఈ సిరీస్ ఆసక్తిని కోల్పోదు. ఇది హంతకుడు ఎవరనే దానికంటే, సాధారణ మనుషులు హంతకులుగా ఎందుకు మారారనే కోణంలో సాగే కథ. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

కొత్తగా నియమితులైన డీసీపీ రీటా ఫెరీరా (భూమి పెడ్నేకర్) ఒక సీరియల్ కిల్లర్ కేసును ఛేదించాల్సి వస్తుంది. హంతకుడు బాధితుల మణికట్టు కోసి చంపుతుంటాడు. రీటా తన వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలతో, వ్యసనాలతో పోరాడుతూనే ఈ కేసును డీల్ చేస్తుంది.

మరోవైపు అనిత (సమారా తిజోరి), సాజిద్ (ఆదిత్య రావల్) అనే జంట తమకు అన్యాయం చేశారని భావించేవార...